
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్‌వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం.
‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!
ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.
(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.)