న్యూస్‌రీల్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో రిజర్వేషన్ల పోరు తారాస్థాయికి చేరింది. నోటిఫికేషన్ రానున్న క్రమంలో ప్రజాప్రతినిధులు పంచాయితీలను ముమ్మరంగా సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 ఏళ్ల తర్వాత నాలుగు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్నింటినీ జనరల్ చేయాలని తెలుగుదేశం నేతలు పట్టుపడుతుంటే.. మరోవైపు తమ స్థానాల సంగతి తేల్చాలి అంటూ జనసేన నేతలు హడావుడి చేస్తున్నారు. మరోవైపు సామాజిక వర్గాల వారీగా ఆశావహులను ముందుకు నెట్టి రాజకీయం ప్రారంభించారు. ఇదిలా ఉండగా బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాకు తెరదీసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది.
శనివారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాధారణంగా రిజర్వేషన్ ప్రక్రియ, డివిజన్లు, వార్డుల పెంపును ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని రోస్టర్ ప్రకారం ఖరారు చేస్తారు. అయితే ఇవేమీ కాకుండా ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారనే అభియోగాలు లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీ మవరం మున్సిపాల్టీలకు 2014 తర్వాత ఎన్నిక లు జరగలేదు. 2019తో పాలకవర్గం ముగియ గా కోర్టు కేసులు, విలీన గ్రామాల వ్యవహారాలు ఇలా పలు కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. తాజాగా అన్ని మున్సిపాల్టీల్లో వా ర్డుల సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా రో స్టర్ నిబంధనలు పాటిస్తూ రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీలు, చింతలపూడి నగర పంచాయతీ, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ము న్సిపాల్టీలు, ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధిక స్థానాలను అటు జ నసేన, ఇటు టీడీపీ నేతలు జనరల్ చేయాలని ప్ర జాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ప్ర త్యక్ష ఎన్నికలు కావడంతో జనరల్ చేస్తే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థే సింహభాగం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తద్వారా తమపై ఆర్థిక భారం తగ్గుతుందనే యోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒకరిద్దరు మాత్రం జనరల్‌కు కేటాయిస్తే భవిష్యత్‌లో తమ ప్రాబల్యం తగ్గడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయలేమని, బీసీ–మహిళ, ఎస్సీ–జనరల్ చేస్తే తక్కువ ఖర్చులో ఎన్నికలు ముగించవచ్చునే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రోస్టర్ నిబంధనల అమలుపై అనుమానాలు ఉన్నాయి.
కూటమి నేతలకు షాక్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల డ్రామాకు తెరలేపిన కూటమి ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో షాక్ తగిలింది. హడావుడిగా 34 శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ జారీ చేసిన జీఓను హైకోర్టులో కొట్టేయగానే సుప్రీంకోర్టును ఆశ్రయించి బీసీలను ఆకట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా అత్యధిక స్థానాలు మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు బీసీలకు ఇవ్వాలనే బలమైన డిమాండ్ మొదలైన క్రమంలో పార్టీ ముఖ్యులు దానికి భిన్నంగా జనరల్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
రిజర్వేషన్‌ల పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీలతో పాటు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఓట్లు దండుకుని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇకపై బీసీలెవరూ చంద్రబాబు మాయమాటలు నమ్మరు.
– కొండేటి శివకుమార్, వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు
‘రిజర్వేషన్’ పోరు
జనరల్ స్థానాల కోసం నేతల పట్టు
బీసీలకు ఇవ్వాలంటున్న మరో వర్గం
కూటమిలో కలకలం
రోస్టర్ నిబంధనల అమలుపై అనుమానాలు


