ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్యారోగ్య శాఖలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాల్గో రోజు కొనసాగింది. కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల నుంచి సుమారు 270 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యో గులు విధులను బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నా రు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, ఓటీ టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ సర్వీసులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులందరికీ వంద శాతం గ్రాస్ జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంహెచ్‌సీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంతెన నాగేశ్వరి, ఏపీ సీఎల్‌టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.ఆనంద్‌కుమార్, ఏపీ కాంట్రాక్ట్ ఎల్‌టీ జాయింట్ సెక్రటరీ పి.మృత్యుంజయరావు, ఏపీ కాంట్రాక్ట్ ఎల్‌టీ ఉపాధ్యక్షుడు ఎల్.అనిల్‌కు మార్, ఏపీ స్టేట్ ఓటీ టెక్నీషియన్ జనరల్ సెక్రటరీ కె.సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.


