జనసేన ఎమ్మెల్యే చిర్రి మట్టి సెటిల్‌మెంట్‌! | - | Sakshi
Sakshi News home page

జనసేన ఎమ్మెల్యే చిర్రి మట్టి సెటిల్‌మెంట్‌!

Oct 10 2026 12:58 AM | Updated on Oct 10 2026 12:58 AM

జనసేన ఎమ్మెల్యే చిర్రి మట్టి సెటిల్‌మెంట్‌!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అక్రమ మట్టి రవాణా వివాదంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (జనసేన) దగ్గరుండి సెటిల్‌మెంట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వీడియోలో పేర్కొన్న అంశాలను బట్టి ఇటీవల ఓ సొసైటీ నేతకు, మహిళకు ఏర్పడిన వాగ్వాదం ప్రధానంగా చర్చకి దారితీసింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య రగడను పరిష్కరించినట్టు ఎమ్మెల్యే బాలరాజు మీడియాకు తెలిపారు. పార్టీ అధిష్టానం సమస్యను పరిష్కరించాల్సిందిగా తనను ఆదేశించిందన్నారు. కొయ్యలగూడెంలో భేటీలు నిర్వహించి సొసైటీ నేత, మహిళకు సంబంధించిన వ్యక్తులతో చర్చించామని, చెరువుల్లో మట్టి తోలకాలకు సంబంధించి జమాబందీ నిర్వహించానన్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు, రాబడి ఫోను బాకీదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి ఆరోపణలు చేస్తున్న మహిళకు మధ్యవర్తుల ద్వారా సొమ్ములు అందజేశామన్నారు. మహిళ ఆరోపించినట్టు సదరు సొసైటీ నేత నుంచి రావాల్సింది రూ.70 లక్షలు కాదని.. సుమారు రూ.15 లక్షలు మాత్రమేనని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే దగ్గరుండి అక్రమ మట్టి రవాణా తోలకాలపై సెటిల్‌మెంట్‌ చేయడం రాజకీయ వరాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

విచారణకు ఆదేశం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విచారణకు ఆదేశించినట్టు వచ్చిన ఉత్తర్వులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కొంతకాలంగా బాలరాజు వ్యవహరిస్తున్న తీరుపై అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గతంలో సూచనలిచ్చినా బాలరాజులో ఎలాంటి మార్పు రాకపోవడంతో మనస్తాపం చెందుతున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వులు ఉన్నాయి.

వివాదాస్పదంగా మారిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement