ప్రతి స్థానంలోనూ అభ్యర్థిని నిలబెడతాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి స్థానంలోనూ అభ్యర్థిని నిలబెడతాం

Oct 10 2026 12:58 AM | Updated on Oct 10 2026 12:58 AM

ప్రతి స్థానంలోనూ అభ్యర్థిని నిలబెడతాం

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ అమర్నాథ్‌

తణుకు అర్బన్‌: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, క్యాడర్‌ అంతా సిద్ధంగా ఉందని రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ గుడివాడ అమర్నాఽథ్‌ అన్నారు. ప్రతి సీటులోనూ గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం 2000–2001లో మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేశారని, మరలా ఇప్పుడే వెళుతున్నారన్నారు. బీసీ ఓట్ల కోసం బీసీ రిజర్వేషన్‌ అంటూ నాటకం ఆడారని, సుప్రీంకోర్టులో పిటిషన్‌ కొట్టేస్తారని తెలిసి కూడా కోర్టుకు వెళ్లినట్టుగా చూపించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితుల్లో బీసీలపై మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులతోపాటు స్థానిక సమస్యల పరిష్కారానికి స్థానిక ఎన్నికలు కీలకమేనని అందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగానే ఉందన్నారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ ఇ బ్బందులు ఉన్నా స్థానిక ఎన్నికలకు వెళ్లి 95 శాతం విజయం సాధించామని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement