న్యూస్‌రీల్
ఓటర్ల విభజనకు సన్నాహాలు
ఆశావహుల్లో సందడి
ఏడేళ్ల ప్రత్యేక పాలన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి. హైకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కసరత్తు మొదలైంది. విలీన ప్రతిపాదిత గ్రామాలతో వార్డుల పునర్విభజనపూర్తయ్యింది. వీటిపై ఈనెల 14లోపు సూచనలు, సలహాలు తెలియజేయాలని పట్టణ ప్రజలను పురపాలక సంఘాలు కోరాయి.
శురకవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాల్టీలకు చివరిగా 2014లో ఎన్నికలు జరగ్గా 2019తో పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. తర్వాత ఎన్నికల నిర్వహణకు విలీన కేసులు అవరోధంగా మారా యి. నాటి నుంచి నాలుగు మున్సిపాల్టీలు ప్రత్యేక పాలనలోనే కొనసాగుతున్నాయి. నరసాపురం ము న్సిపాల్టీ, ఆకివీడు నగర పంచాయతీలో సమస్య లేకపోవడంతో 2021లో ఎన్నికలు జరగడం, ఇటీవల పాలకవర్గాల పదవీ కాలం పూర్తికాగా, మరలా ఎన్నికలకు అవసరమైన కసరత్తు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్నాయి. విలీన కేసులు నడుస్తున్న మున్సిపాల్టీల్లో ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఇటీవల హైకోర్టు కేసులను కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది.
కసరత్తు ప్రారంభం : నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు ప్రకారం విలీన ప్రతిపాదిత గ్రామాలతో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాల్టీల్లో వార్డుల పునర్విభజనపై వార్డుల హద్దుల వివరాలతో ముసాయిదా జాబితాను విడుదల చేశారు. దీనిపై ఈనెల 14లోపు సూచనలు, సలహాలు తెలియజేయాలని పట్టణ ప్రజలను కోరారు. పాలకొల్లులోను వార్డుల డ్రాఫ్టు విడుదలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఇప్పటికే తొలి విడతలోని నరసాపురం, ఆకివీడులలో వార్డుల పునర్విభజన లోపభూయిష్టంగా జరిగిందన్న విమర్శలున్నాయి. నరసాపురంలోని 31 వార్డులను 36కు, ఆకివీడులో 20 నుంచి 28 వార్డులకు పెంచారు. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్‌సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని వార్డుల సరిహద్దులు, ఓటర్ల సంఖ్యను సర్దుబాటు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పునర్విభజన లోపాలను సరిచేయాలని రెండు పట్టణాల నుంచి ఉన్నతస్థాయికి వినతులు అందాయి. రెండవ విడతలోని నాలుగు మున్సిపాల్టీల్లో పరిస్థితి ఏమిటన్నది ప్రజాభిప్రాయంలో తెలియనుంది. కాగా పునర్విభజనపై ఏకాభిప్రాయం సాధించే దిశగా అఖిలపక్ష సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిర్ణీత గడువు ముగిశాక వార్డుల తుది జాబితాను విడుదల చేస్తారు.
ఎమ్మెల్సీ రవీంద్రనాథ్
భీమవరం: ప్రస్తుతం 39 వార్డులు ఉండగా.. తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాలతో కలిపి 52 వార్డులకు పెంచారు.
తణుకు: ప్రస్తుతం 34 వార్డులు ఉండగా.. వెంకటరాయపురం, పైడిపర్రు, వీరభద్రపురం గ్రామాలతో కలిపి 44 వార్డులకు పెరిగాయి.
పాలకొల్లు: ప్రస్తుతం 31 వార్డులు ఉండగా.. దిగమర్రు, వరిధనం, కొంతేరు, భగ్గేశ్వరం, పూలపల్లి, యాళ్లవానిగరువు, ఉల్లంపర్రు, అడివిపాలెం గ్రామాలతో కలిపి 44 వార్డులకు పెంచారు.
తాడేపల్లిగూడెం: ప్రస్తుతం 32 వార్డులు ఉండగా.. పడాల, కుంచనపల్లి, ఎల్.అగ్రహారం, కుండ్రుప్రోలు, ప్రత్తిపాడు గ్రామాలతో కలిపి 48 వార్డులకు పెంచారు.
పట్టణం.. మారిన స్వరూపం
భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో వార్డుల పునర్విభజన
విలీన గ్రామాలతో కొత్త వార్డులు
14 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు
త్వరలో ఓటర్ల విభజనకు కసరత్తు
విలీన కేసులతో ఏడేళ్లుగా ప్రత్యేక పాలనలోనే ఆయా పట్టణాలు
హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు
వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సామాజికవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్లను విభజన చేయాల్సి ఉంది. విలీన గ్రామాలతో భీమవరం మున్సిపాల్టీలో 1.62 లక్షల మంది ఓటర్లు ఉండగా తణుకులో 75 వేలు, పాలకొల్లులో 76,063, తాడేపల్లిగూడెంలో 1.04 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు విభజన అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. చాలావరకు ఈ నాలుగు మున్సిపాల్టీల్లో రెండో విడతలోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సుదీర్ఘకాలం తర్వాత నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరుగనుండటంతో స్థానింగా సందడి మొదలైంది. వార్డులపై స్పష్టత రాగా రిజర్వేషన్లపై ఆశావహులు ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏ వార్డులో ఏ సామాజికవర్గం ఓటర్లు ప్రాబల్యం ఎక్కువగా ఉంది?, తమ విజయావకాశాలపై బేరీజులు వేసుకుంటున్నారు. అనుకూల వార్డులో ముందుగానే కర్చీఫ్ వేసుకునే పనిలో ఉన్నారు.


