ఆక్వా సాగులో అనర్థాలను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా సాగులో అనర్థాలను గుర్తించాలి

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

ఆక్వా సాగులో అనర్థాలను గుర్తించాలి

ఆక్వా సదస్సులో శాస్త్రవేత్తలు

కై కలూరు: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రైతులకు జరిగే అనర్థాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్‌, గోవా సీనియర్‌ సైంటిస్టు డాక్టర్‌ త్రివేష్‌ సురేష్‌ మయేకర్‌ సూచించారు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) సౌజన్యంతో సెంట్రల్‌ కోస్టల్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐసీఏఆర్‌–సీసీఏఆర్‌ఐ), ద ఎనర్జీ అండ్‌ రిసో ర్సస్‌ ఇనిస్టిట్‌ (టెరి) గోవా ఆధ్వర్యంలో ‘చిన్న తరహా చేపల రైతుల కోసం వాతావరణం–స్మార్ట్‌ ఆక్వాకల్చర్‌పై సమర్థన నిర్మాణం’ అనే అంశంపై కై కలూరు ఫిషరీస్‌ కార్యాలయంలో గురువారం సదస్సు నిర్వహించారు. కై కలూరు ఫిషరీస్‌ ఏడీ ఎం.రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సైంటిస్ట్‌ డాక్టర్‌ త్రివేష్‌ సురేష్‌ మయేకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.09 లక్షల హెక్టార్లలో వనామీ రొయ్యల సాగు జరుగుతోందన్నారు. 2024–25లో 10.54 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. ఆక్వా రైతులు మారుతున్న ఏఐ టెక్నాలజీ వినియోగించాలన్నారు. వెంకటరామన్నగూడెం, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం, ఫిషరీస్‌ సైంటిస్టులు దేవీ వరప్రసాదరెడ్డి, అప్పన శ్రీనివాస్‌ రొయ్యల రైతులు ఎక్కువ స్టాక్‌ వేయడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. కలుషిత నీరును ఇతర రైతులు తోడుకోవద్దని చెప్పారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అండ్రాజ శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఆక్వా సాగు పరిస్థితిని వివరించారు. ఏఐసీ సిబ్బంది సత్య బీమా విధానాన్ని చెప్పారు ఫిషరీష్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు శ్రీనివాసరావు, సీహెచ్‌ గణపతి, ఆక్వా రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement