మహిళా చట్టాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మహిళా చట్టాలపై అవగాహన

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

మహిళా చట్టాలపై అవగాహన 15 రోజులు.. రూ.1.27 కోట్లు జిల్లా వైద్య మండలి ఏర్పాటు కేజీబీవీ మెరిట్‌ లిస్టులపై అభ్యంతరాల స్వీకరణ పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ తవ్వకాలపై భారీ జరిమానా

పెదవేగి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి ఆదేశాల మేరకు గురువారం భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కుటుంబ వివాదాల వల్ల కుటుంబ వ్యవస్థ, పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుందని, వివాదాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కేసులను మధ్యవర్తిత్వం కార్యాలయానికి రిఫర్‌ చేయించుకుని పరిష్కారానికి సహకరించాలని సూచించారు, అవసరమైన న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలన్నారు. డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ సూర్యచక్రవేణి, వన్‌స్టాప్‌ సెంటర్‌ లీగల్‌ అడ్వయిజర్‌ తేజస్వి, గ్రామ కార్యదర్శి భూపతిరాజు కృష్ణంరాజు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. గత 15 రోజులకు రూ.1,27,88,160 ఆదాయం లభించినట్టు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపంలో 167 గ్రాముల బంగారం, 1.573 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన రూ.2,000, రూ.500 నోట్ల ద్వారా రూ.7 వేలు లభించాయన్నారు. భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ ఈఓ బీఎల్‌ నగేష్‌బాబు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉద్యోగుల క్లెయిమ్‌లను వైద్యపరంగా పరిశీలించి, ధ్రువీకరించేందుకు జిల్లా వైద్య మండలిని ఏర్పాటు చేసినట్టు డీఈ ఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, పోలవరం జిల్లాలకు చెందిన పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులకు ఏలూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని కేటాయించామన్నారు. ఈనెల 16 వరకు ఏలూరు జీజీహెచ్‌లో వైద్య మండలి అందుబాటులో ఉంటుందన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేజీబీవీ నియామకాలకు సంబంధించి మెరిట్‌ లిస్టులను జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష ఎక్స్‌–అఫీషియో ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ జిల్లా కార్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. జాబితాలపై అభ్యంతరా లు ఉంటే ఈనెల 12న సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష, ఏలూరు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గడువు దాటితే పరిశీంచబోమన్నారు.

దెందులూరు: సింగవరంలో రైతులకు 13 భద్రత ఫీచర్లతో పట్టాదారు పాస్‌ పుస్తకాలను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అందజేశారు. వచ్చే మార్చిలోపు రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ పూర్తి చే స్తామని కలెక్టర్‌ అన్నారు. ప్రతి నెలా 20, 30 గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తి చేస్తామన్నారు. తహసీల్దార్‌ బి.సుమతి, ఎంపీడీఓ వీర ప్రతాప్‌ పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: కనసానపల్లిలో అనుమతులకు మించి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంపై మైనింగ్‌ శా ఖ అధికారులు విచారణ చేసి జరిమానా విధించారు. శ్రీ ఎకో మైన్స్‌ అనే సంస్థ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టినట్లు గ్రామానికి చెందిన ఆలూరు రామ్మోహన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రావెల్‌ తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు సర్వే నంబర్లలో 72,223 టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తవ్వారని నిర్ధారించి రూ.2.69 కోట్ల జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement