ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏ లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ని సంస్కరించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స మీక్ష సమావేశం జిల్లా ఇన్‌చా ర్జి మంత్రి నాదెండ్ల మనో హర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎ మ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయ జిల్లాల నుంచి వందల మంది రోగులు ఏలూరు వచ్చి ఇక్కడ వైద్య సౌకర్యాలు లేక విజయవాడ, గుంటూరుకు తరలిస్తున్నారని, ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లడానికి వీల్ చైర్ గెంటే సిబ్బంది కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద, డెలివరీ కేసులు చూసేందుకు సీనియర్ సర్జన్లు, సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై నిత్యావసర సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ గత నెలలో చెప్పారని, ఇప్పటికీ అమలు కాలే దన్నారు. జిల్లాలో విచ్చలవిడిగా మైనింగ్, అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పగా.. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి మనోహర్ హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన స్కూల్ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు 80 శాతం పూర్తయినా, వాటి నిర్మాణాలు జరగకపోవడతో విద్యార్థులు, పిల్లలు అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో అక్రమ పశు రవాణా జరుగుతున్నా ఎటువంటి చర్యలు లేవని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జీలుగుమిల్లిలోని కారం పొడి ఫ్యాక్టరీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదని, అంగన్‌వాడీలకు ఇచ్చిన ఇండక్షన్ స్టవ్స్ 300 వరకు పనిచేయకపోవడంతో పిల్లలకు సమయానికి ఆహా రం పెట్టలేకపోతున్నారని, కొత్త స్టవ్‌ను మరమ్మతు లు చేయించాలని కోరారు. మంత్రి మనోహర్ అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించి చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రకృతి సాగును చేరువ చేసేలా..
ప్రకృతి సాగు ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరు వ చేసేలా మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాజ్యసభ స భ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్సీ జయమంగళ, ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ పాల్గ్గొన్నారు.


