న్యూస్‌రీల్
కౌలు రైతులను ఆదుకోవాలి
సాగు విస్తీర్ణం తగ్గించారు
● అధ్వానంగా కౌలు రైతుల పరిస్థితి
● రెండేళ్లుగా తీవ్ర నష్టాలు
● ఈ ఏడాది బ్యారన్ రిజిస్ట్రేషన్ కాక ఆందోళన
● ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
గురువారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
బుట్టాయగూడెం: పొగాకు కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా, ఆందోళనకరంగా మా రింది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థికంగా కుంగిపోయారు. అధిక పెట్టుబడుల వ్యయం, మార్కెట్‌లో ధరల పతనం, భూములు కౌలు భారం కోలుకోలేని దెబ్బతీశాయి. దీనితో పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యారన్ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పెట్టుబడుల భారం
పొగాకు సాగులో భారీగా పెట్టుబడులు పెరిగిపోయాయని కౌలు రైతులు అంటున్నారు. కౌలు రైతు ఒక బ్యారన్ పరిధిలో నాలుగు ఎకరాల్లో పంట వేస్తే సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. గతేడాది (2025–26లో) 50.82 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో బ్యారన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు సుమారు రూ.8 లక్షల వరకూ రుణాలు ఇచ్చారు. అయితే ఈ రుణం సాగు పెట్టుబడులకు సరిపోకపోవడంతో అప్పులు చేశారు. అలాగే రెండేళ్లుగా మార్కెట్‌లో సరైన ధర లేకపోవడం వల్ల పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పులు తీరని పరిస్థితి. ఇదిలా ఉండగా గతే డాది ఎన్‌ఓసీ లేకుండా బ్యారన్‌లకు రిజిస్ట్రేషన్ చేయడంతో పంట సాగు చేపట్టారు. అయితే ఈ ఏడాది బ్యారన్ రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. బ్యాంకు రుణాలు తీర్చకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
అయోమయంలో రైతులు
జంగారెడ్డిగూడెం–1, 2, గోపాలపురం, కొయ్యలగూడెం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో సుమారు 28.02 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది.
ఈ లెక్కన బ్యారన్‌కు 2 వేల కిలోల ఉత్పత్తి చేయాలి. బ్యారన్‌కు 2 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సాగుదారుకు గరిష్టంగా నాలుగు బ్యారన్‌లకు అనుమతి ఇచ్చారు. 2025–26 పంటల కాలంలో బ్యారన్‌కు 41 క్వింటాల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 20 క్వింటాలకు తగ్గించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిబంధనల ప్రకారం పొగాకు సాగు చేస్తే గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఉత్పత్తి తగ్గించడంతో బ్యారన్ రైతులకు బ్యాంక్ రుణాలు కూడా తగ్గే అవకాశం ఉందని ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని వాపోతున్నారు.
పొగాకు కౌలు రైతులను ప్రభుత్వం, బోర్డు అధికారులు ఆదుకోవాలి. గతేడాది ఎన్‌ఓసీ లేకుండా బ్యారన్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఉపశమనం కలిగింది. రెండేళ్లుగా ధరల పతనం, మార్కెట్ సంక్షోభంతో కౌలు రైతులు అప్పుల పాలయ్యారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం, బోర్డు అధికారులు కౌలు రైతులకు ఎన్‌ఓసీ లేకుండా బ్యారన్ లైసెన్సులు రెన్యువల్ చేసి ఆదుకోవాలని కోరుతున్నాం.
– చందా ప్రసాద్,
కామయ్యపాలెం, జీలుగుమిల్లి మండలం
ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం తగ్గించడం బాధాకరం. బ్యారన్‌కు 20 క్వింటాల్ తగ్గించడంతో కౌలు రైతుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారింది. కనీసం పెట్టుబడులు కూడా పెట్టలేని దుస్థితి. నాలుగు బ్యారన్‌లు సాగు చేస్తే రూ.8 లక్షలకు.. ఇప్పుడు ఉత్పత్తి తగ్గించడంతో రూ.3.50 లక్షలు మాత్రమే రుణం వస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేదు.
– వడ్లమూడి వెంకటేశ్వరరావు,
రామన్నగూడెం, జీలుగుమిల్లి మండలం


