ఉంగుటూరు: జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బుధవారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మండలంలోని యర్రమిల్లిపాడు గ్రామానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు రాగా ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఆయా పార్టీలకు చెందిన వారు సుమారు 50 మంది వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. చందమామల జాను, తాడిగడప రాజేష్, కండెల్లి రాజేష్, దొండపాటి గంగాధరరావు, కలపల సురేష్, కంతేటి వెంకటేశ్వరరావు, కండెల్లి డేవిడ్, కాజాపవన్, కండెలి లమోజేష్, దాసరి అన్నవరం, కొడవటి నరేష్ ముమ్మడి సాయి కుమార్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ వాసుబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు మరడ మంగరావు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, పార్టీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి తదితరులు పాల్గొన్నారు.


