పునరావాస కాలనీలు దేశానికే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

పునరావాస కాలనీలు దేశానికే ఆదర్శం

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

ఉద్యోగ భద్రత కోసం.. పునరావాస కాలనీలు దేశానికే ఆదర్శం

ఉద్యోగ భద్రత కోసం..
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 8లో u

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): పోలవరం ప్రా జెక్టు పునరావాస (ఆర్‌అండ్‌ఆర్‌) కాలనీల్లో చేపడుతున్న నిర్మాణాలు, మౌలిక వసతులు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని నేషనల్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎన్‌ఎంసీ) అడ్వయిజర్‌ (పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌) ముదిత్‌ కుమార్‌సింగ్‌ అన్నారు. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయ తీ చల్లవారిగూడెం పునరావాస కాలనీలోని నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలనీ వద్ద ఆయన మాట్లాడుతూ రెండేళ్లతో పోలిస్తే కాలనీలో నిర్మాణ నాణ్యత, మౌలిక వసతుల పనులు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి వి.అభిషేక్‌ మాట్లాడుతూ.. పునరావాస కాలనీల్లో 2,200 నుంచి 5,300 వరకు ఇళ్ల నిర్మాణం చేపడు తున్నామని, ఇప్పటికే 3,100 ఇళ్లు పూర్తయ్యా యన్నారు. డిసెంబర్‌లోపు పూర్తిచేస్తామన్నారు.

చింతూరు నిర్వాసితులకు ప్రత్యేక కాలనీలు

చింతూరు ప్రాంతం నుంచి ఏలూరు వైపు తరలించనున్న సుమారు 12,500 మంది నిర్వాసితుల కోసం పునరావాస పథకాలను ప్రభుత్వం ఆమోదించిందని, వారి కోసం రూ.800 కోట్లకు పైగా నిధుల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇల్లు పూర్తయితేనే పట్టాలు

నిర్వాసితులకు త్వరగా ఇళ్లు పూర్తి చేసి ఇళ్లతో పాటు పట్టాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేశారు. భూమికి భూమితో పాటు సాగుభూమి, ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు అందజేస్తామని తెలిపారు. కా లనీల సమీపంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని, సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ, డీఆర్‌డీఏ, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో కలిసి చేతివృత్తు లు, ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ సి.జయరామాచారి, హౌసింగ్‌ పీడీ జి.సత్యనారాయణ, ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement