వేలేరుపాడు: అర్హత ఉన్న పోలవరం నిర్వాసితులందరికీ ఇంటి విలువల పరిహారం అందిస్తామని ఏలూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వీవీ శర్మ శర్మ పేర్కొన్నారు. బుధవారం రుద్రంకోట, రేపాకగొమ్ములో ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభ లు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇంటి వి లువల పరిహారాన్ని త్వరలోనే విడుదల చే స్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, అవార్డులో పేరు ఉండి లబ్ధిదారుడు మరణిస్తే మర ణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్టు అందజే యాలని సూచించారు. ప్రస్తుతం అందు బాటులో లేనివారు తమ పత్రాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు అందించాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ తులసి, జేఈ జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఎర్త్ కం రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణం జరుగుతున్న తీరు, నాణ్యతపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ వోహ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ప్రాజెక్టు ప్రాంతంలో పనులను ఆయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్‌కుమార్, జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ పి.రామచంద్రరావు, డీఈఈలు తదితరులతో కలిసి ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో గ్యాప్–1,2 జీహిల్, జీడ్యాష్ హిల్‌ను ఆయన సందర్శించారు. పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. ఈ నెలలో విదేశీ నిపుణులు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించే అవకాశం ఉందన్నారు.
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి జలసమృద్ధి చేకూరని కోరుతూ క్షేత్ర పాలకుడు భ్రమరాంభా మల్లేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వారుణానువాక జప కార్యక్రమాలు బుధవారం రెండో రోజుకు చేరాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం విశేష కార్యక్రమాలతో యాగం ముగుస్తుందని ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలోని సుమారు 14,600 మంది కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. కలెక్టరేట్ వద్ద వీరి దీక్షలకు ఏపీ ఎన్‌జీఓస్ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు డీఎస్‌సీ ద్వారా నియామకాలు పొంది కనీస వేతనాలు (బేసిక్ పే)ని మాత్రమే ఇస్తున్నారని, వారి శ్రమకి తగ్గ వేతనాలు ఇవ్వాలని వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్ మాట్లాడుతూ ఐక్య ఉద్యమంతో ముందుకు వెళ్లాలని, కుటుంబసభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు మాట్లాడుతూ కొందరు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారని, వారిపై అప్రమత్తంగా ఉండి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఓటీ టెక్నీషియన్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏపీఎంహెచ్‌సీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంతెన నాగేశ్వరి, జేఏసీ నాయకురాలు ఎ.సులోచన, ఏపీ సీఎల్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టి.ఆనంద్ కుమార్, ఏపీ కాంట్రాక్ట్ ఎల్‌టీ జాయింట్ సెక్రెటరీ పి.మృత్యుంజయ రావు, వైస్ ప్రెసిడెంట్ ఎల్.అనిల్‌కుమార్, ఏపీ స్టేట్ ఓటీ టెక్నీషియన్ జనరల్ సెక్రటరీ కె.సుధాకర్ నాయకత్వం వహించారు.
భీమవరం: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పశ్చిమగోదావరి క్రీడాకారులు సత్తాచాటారు. సీని యర్ కాంపౌండ్ మెన్, సీనియర్ కాంపౌండ్ ఉమెన్ విభాగాల్లో పతకాలు సాధించారు. భీమవరం లో జరిగిన పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందించారు.


