నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు | - | Sakshi
Sakshi News home page

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు

Nov 27 2025 6:29 AM | Updated on Nov 27 2025 6:29 AM

నూజివ

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి మద్దతు ధర కోసం ఉద్యమించాలి మొక్కజొన్న రైతుల ధర్నా

నూజివీడు: పట్టణంలోని మార్కెట్‌లోకి మామిడి చిన్న రసాలు వచ్చాయి. మున్సిపాలిటీ సమీపంలోని పండ్లమార్కెట్‌ సెంటర్‌, రైతు బజార్‌ వద్ద తోపుడు బండ్లపై చిన్న రసాలను వీధి వ్యాపారులు విక్రయిస్తున్నారు. కాయను సైజును బట్టి రూ.80 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. పప్పులో వేసుకొని వండుకుంటే మంచి రుచిగా ఉండటంతో రసాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

ఏలూరు (టూటౌన్‌ ): భారత రాజ్యాంగంపై యువతకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో, బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠికను అనుసరిస్తామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రామకృష్ణంరాజు, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్‌ మురళీకృష్ణ, 7వ అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, ఉమ్మడి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌, న్యాయ వాదులు, కోర్టు ఉద్యోగులు, పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఎస్‌.కె.ఎం, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం ఏలూరులో భారీ ర్యాలీలు, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించారు. ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏఐటీయుసీ, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే అధ్యక్షతన జరిగిన సభలో రైతు–కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి ఝాన్సీ, సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్‌, బీకెఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, బీకెఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువీ, ఏఐయుకెఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కె.గౌస్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్‌ తదితరులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఏలూరు (టూటౌన్‌): మొక్కజొన్న సీడ్‌ ఆర్గనైజర్‌ నుంచి ద్వారకాతిరుమల మండలం హనుమాన్‌గూడెం మొక్కజొన్న విత్తన రైతులకు రూ.20 లక్షల బకాయిలు ఇప్పించి వెంటనే ఆదుకోవాలని, రైతులకు అనుకూలమైన విత్తన చట్టం తేవాలని, విత్తన కంపెనీ నుంచి రైతులకు అగ్రిమెంట్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం – ఆంధ్రప్రదేశ్‌ విత్తన రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మొక్కజొన్న విత్తన రైతులు బుధవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. మాకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం శివారు హనుమాన్‌ గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు సీడ్‌ ఆర్గనైజర్‌ చేతిలో మోసపోయారని వారికి న్యాయం చేయాలని కోరారు.

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు  
1
1/2

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు  
2
2/2

నూజివీడు మార్కెట్‌లోకి చిన్న రసాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement