సంతానం కలుగుతుందనే నమ్మకంతో..
కార్తీక మాసంలో ధర్మాలింగేశ్వర స్వామి ఆలయం ఎదుట ప్రాణాచారం పడటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సంతానం లేని మహిళలు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాచారం పడతారు. ఈ సందర్భంగా వచ్చిన కలలు నిజమని భక్తులు ధృఢంగా నమ్ముతారు. ఈ ప్రాంతంలో అనేక మందికి సంతానం కలిగిందనేది వాస్తవం.
–నండూరి భాను, కొత్తూరు, కామవరపుకోట
ఈ ప్రదేశానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే భక్తులతో, పిక్నిక్‌కి వచ్చిన విద్యార్థులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వచ్చేవారికి సరైన మౌలిక వసతులు లేవు. ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేలా చొరవ తీసుకోవాలి. -బొల్లు వెంకట సత్యనారాయణ, కామవరపుకోట
సంతానం కలుగుతుందనే నమ్మకంతో..


