కూటమి పాలనలో భక్తులకు భద్రత కరువు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వానికి భగవంతుడిపై ఏమాత్రం భయం, భక్తి లేవనీ, కనీసం భక్తులకు సరైన సౌకర్యాలు, భద్రత కల్పించటంలోనూ ఘోరంగా వైఫల్యం చెందుతుందనీ వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మృతిచెందగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ వేలాది మంది భక్తులు వెళ్లే ఆలయానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని దేవదాయ శాఖ మంత్రి మాట్లాడటం దారుణమన్నారు. ఆలయం ప్రైవేటుది అయినా భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రి ప్రజల భద్రతను గాలికి వదిలేసి కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించటానికే మంత్రి అయినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్, జి ల్లా మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు ఉన్నారు.
భక్తుల ప్రాణాలతో చెలగాటం
ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, వారి ఊసురు తగులుతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రావులపర్రులో ఆదివారం రాత్రి కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో నివాళులర్పించి శాంతి ర్యాలీ నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు కూటమికి ప్రచార్భాటమే తప్ప భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్త్‌రఫ్ చే యా లని డిమాండ్ చేశారు. పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మరడ వెంకట మంగారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నేత పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ తదితరులు పాల్గొన్నారు.
రావులపర్రులో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు
ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కూటమి పాలనలో భక్తులకు భద్రత కరువు


