కుట్రతోనే జోగి రమేష్ అరెస్ట్
భీమడోలు: నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. పూళ్లలో పార్టీ నేత కందులపాటి శ్రీనివా సరావు ఇంటి వద్ద ఆదివారం ఆయన మాజీ ఎ మ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్‌పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం నీతిమాలిన చర్య అన్నారు. తుపాను బాధితులకు పరిహారం ఎగ్గొట్టడానికి, కాశీబుగ్గ ఘటన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. బీసీ నాయకులను అణచివేసే ధోర ణిలో అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమన్నా రు. అక్రమ కేసులను మానుకుని తుపాను బాధిత రైతులను, కాశీబుగ్గ ఘటన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు
మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా ఇరికించారన్నారు. 18 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. కూటమి నేతల కనుసన్నలల్లో మద్యం బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారన్నారు. కుట్రపూరితంగానే ప్రస్తుత సమస్యల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారన్నారు. కూ టమి దుశ్చర్యలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, వారిని ఎవరు నమ్మే స్థితిలో లేరని ఘాటుగా విమర్శించారు. తక్షణమే జోగి రమేష్‌ను విడుదల చేయాలని వాసుబాబు డిమాండ్ చేశారు.
కారుమూరి సునీల్‌కుమార్
పుప్పాల వాసుబాబు
కుట్రతోనే జోగి రమేష్ అరెస్ట్


