వైభవంగా గిరి ప్రదక్షిణ
ఆగిరిపల్లి: శోభనాచలుడి గిరి ప్రదక్షిణ మహత్తర ఘట్టంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగిరిపల్లి లోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శోభనగిరి (కొండ) చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ కనుల పండువగా సాగింది. భూనీల సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను తిరుచ్చి పల్లకి వాహనంపై, శేష వాహనంపై శోభనగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామం, గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు.
వైభవంగా గిరి ప్రదక్షిణ


