శ్రీవారి కొండపై కొమ్మల తొలగింపు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన, శివాలయం–పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో పెరిగిన చెట్ల కొమ్మలను, పొదలను దేవస్థానం సిబ్బంది తొలగిస్తున్నారు. క్షేత్ర పరిసరాల్లో విష సర్పాల బెడదపై శనివారం సాక్షి దినపత్రికలో ‘పాములు కరుస్తున్నా.. పట్టదా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. వెంటనే శివాలయం– పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో ఇరువైపులా ఉన్న పొదలను, దారి కనబడకుండా మూసివేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. కొండపైన రహదారికి ఇరువైపులా, పలు ప్రాంతాలో దట్టంగా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు.
శ్రీవారి కొండపై కొమ్మల తొలగింపు


