పాముకాటుతో మహిళ మృతి
కలిదిండి(కై కలూరు): పాము కాటుకు గురైన వివాహిత చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల విజయ(32) భర్త దుర్గారావుతో కలసి చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. దుర్గారావు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కొట్టులో పాల ప్యాకెట్టు తీసుకురావడానికి వెళ్ళిన ఆమె కాలిని పాము కరిచింది. గమనించి కలిదిండి ప్రభుత్వాసుపత్రి, అక్కడ నుంచి కై కలూరు సీహెచ్‌సీ, చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త దుర్గారావు ఫిర్యాదుతో కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు.


