ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన | - | Sakshi
Sakshi News home page

ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన

Nov 1 2025 7:44 AM | Updated on Nov 1 2025 7:44 AM

ఉమా స

ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన

ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన మద్దిలో మహా పూర్ణాహుతి వృద్ధురాలి మెడలో ఆభరణాల అపహరణ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు చైన్‌ స్నాచింగ్‌పై కేసు నమోదు

భీమవరం (ప్రకాశంచౌక్‌): కార్తీకమాసం పదో రోజు గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో సీహెచ్‌ రవిబాబు కుటుంబ సభ్యులు లక్ష పత్రి పూజ నిర్వహించారు. స్వామికి ఏకాదశి మహా రుద్రాభిషేకం అనంతరము లక్ష బిల్వార్చన, రుద్ర హోమం నిర్వహించారు. గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో కార్తీకమాసం 10వ రోజు సుమారు 4 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు, సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సప్తాహ మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్‌వీ చందన మాట్లాడుతూ ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, సప్తాహ మహోత్సవాలు సైతం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 7 రోజుల పాటు నిర్విరామంగా భక్తి సంకీర్తనలు చేసిన భక్త బృందాలకు వేదాశీర్వాదం గావించినట్లు చెప్పారు. నవంబర్‌ 2న గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.

భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద వృద్ధురాలి మెడలోంచి ఐదు కాసుల బంగారు ఆభరణాలను తెంపుకపోయారు. ఉంగుటూరు మండలం కై కరానికి చెందిన కుమారి బైక్‌పై భర్తతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వచ్చింది. పనులు ముగించుకుని కై కరం వెళ్తుండగా కురెళ్లగూడెం కొండాలమ్మ గుడి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి కుమారి మెడలోని సుమారు ఐదు కాసుల సూత్రాల నానుతాడు, నల్లపూసల తాడును లాక్కుని తాడేపల్లిగూడెం వైపు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉంగుటూరు: బైక్‌పై ఉంగుటూరు వస్తున్న తండ్రీ కూతుళ్లు యర్రచెరువు వద్ద ట్రాక్టరును తప్పించే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో కూతురు ఓలేటి వరలక్ష్మికి కాలు విరిగింది. ఆనందరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ముదినేపల్లి రూరల్‌: రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తెంపుకుని పారిపోయిన సంఘటన మండలంలోని వడాలిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన నక్కా సత్యవతి కిరాణా షాపులోకి వెళ్లి సరుకులు కొనుక్కుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు మోటారుసైకిల్‌పై వేగంగా వచ్చి సత్యవతి మెడలో ఉన్న రెండు కాసుల బంగారు నానుతాడు లాక్కొని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభధ్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన  
1
1/1

ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement