రేపే శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి, గట్లపైన, పుష్కరణి పరిసరాల్లోని చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో అవి విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. పుష్కరిణి ముందు ఏర్పాటు చేసిన స్వామి భారీ విద్యుత్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవం జరిగే ఆదివారం నాడు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
భారీగా జరుగుతున్న ఏర్పాట్లు


