దోపిడీకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
నూజివీడు: గత ప్రభుత్వంలో రాష్టంలో 17 ప్ర భుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూ టమి ప్రభుత్వం మాత్రం దోపిడీ చేసేందుకే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టనుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సిద్ధార్ధనగర్, సుంకొల్లు గ్రా మాల్లో మెటికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యసేవలందించేలా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. ఐదు కళాశాలలు పూర్తికాగా విద్యార్థులు చదువుకుంటున్నారని, మిగిలినవి వివిధ దశల్లో ఉండగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమవ్వడం దారుణమన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చుచేస్తే అన్ని కళాశాలలూ అందుబాటులోకి వస్తాయని, అయితే ప్రభుత్వం ఆ పని చేయకుండా మాయమాటలతో ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. భవిష్యత్ తరాల ఆస్తి అయిన వైద్య కళాశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు రామిశెట్టి కృష్ణ, కిషోర్, మాజీ జెడ్పీటీసీ బాణావతు రాజు, సుంకొల్లు సర్పంచ్ దుడ్డు నాగమల్లేశ్వరరావు, కొనకాల శ్రీనివాసరావు, ముల్లంగి జమలయ్య, మాజీ సర్పంచ్ కొనకాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలి
ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభించాల్సిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించకుండా కావాలని జా ప్యం చేస్తున్నారని, దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని, కేంద్రీయ విద్యాల యాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నను మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. గురువారం ఆయన సబ్ కలెక్టర్‌ను కలిసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.


