ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీస్ ఓపెన్ హౌస్ ఆ కట్టుకుంది. ఏలూరులోని పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ప్రజలు భారీ సంఖ్యలో ఓపెన్ హౌస్‌ను సందర్శించా రు. కేసుల దర్యాప్తులో వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరా లు, ఆధునిక డ్రోన్స్, పోలీస్ జాగిలాలు, ఆ యుధాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఓపెన్ హౌస్‌ను నిర్వహించగా జిల్లా ఎ స్పీ ప్రతాప్ శివకిషోర్ విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీస్ దర్యాప్తులో క్లూస్‌టీం, కమ్యూనికేషన్ వ్యవస్థ, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ పరికరాలు, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్ పనితీరును వివరించారు. పోలీస్ విధుల్లో వినియోగించే ఆయుధాలు ఎస్‌ఎల్‌ఆర్, ఏకే–47, ఎంపీ5కే, టియర్‌గ్యాస్ గన్స్, జాకెట్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది విధులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పుతో కృషి చేయాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ హబీబ్ బాషా, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఏఆర్ ఆర్‌ఐలు పవన్‌కుమార్, సతీష్, ఈగల్ ఆర్‌ఎస్‌ఐ ఉదయ్‌భాస్క ర్, ఐటీ కోర్ ఇన్‌చార్జి నరేంద్ర, అమరేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటేశులు తదితరు లు పాల్గొన్నారు.


