ఆధ్యాత్మిక సేవలు విస్తరించాలి
దెందులూరు: ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరింపజేయాలని పోప్ లియో సూచించారని ఆర్‌సీఎం ఏలూరు పీఠం జనరల్ డాక్టర్ పి.బాల తెలిపారు. బుధవారం ఇటలీలో వాటికన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోప్ లియోను ఆయన అధికార బంగ్లాలో కలిశామన్నారు. 38వ గురుత్వ పట్టాభిషేకంలోకి ప్రవేశించిన బాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా నుంచి ఏలూరు పీఠం ప్రతినిధులుగా వెళ్లిన చాన్సలర్ ఇమ్మానుయేల్, భీమవరం ఫాదర్ స్టాలిన్ మస్కాలి, పట్టణ మేయర్ వేరోనికా లుండిన్ స్కోల్ద్‌కి ఉన్నారు. ఇటలీలోని సిసిలీలో సెయింట్ ఆంథోనీ చర్చిలో డాక్టర్ బాల ఇటాలియన్‌లో ప్రత్యేక దివ్య పూజ బలి అర్పించారు.
ఏలూరు టౌన్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగాయగూడెం ప్రాంతానికి చెందిన వీ.జోజి (52) స్థానికంగా ఉన్న కేన్సర్ హాస్పిటల్‌లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్రెయినేజీలో చెత్త తొలగించేందుకు ఇనుప ఊచతో శుభ్రం చేస్తుండగా అదే సమయంలో పక్కనే ఉన్న నీటి మోటరుకు చెందిన విద్యుత్ వైరుకు ఇనుప ఊచ తగలటంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


