బీమా పాలసీలకు మొబైల్ నెంబర్లు అప్‌డేట్ చేసుకోవాలి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీదారులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి పాలసీదారుడు వారి పాలసీలకు మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలని ఏలూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ సురకత్తుల శ్రీకర్ బాబు తెలిపారు. గురువారం ఏలూరు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, ప్రీమియం చెల్లింపు వివరాలు, ఇతర అలెర్ట్‌లను నేరుగా ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా త్వరగా పొందవచ్చన్నారు. అప్‌డేట్ చేసిన వివరాలతో కస్టమర్ పోర్టల్ (http://pi.indiaport.gov.in) ద్వారా పాలసీదారుడు ప్రీమియంను స్వయంగా ఆనన్‌లైన్‌లో చెల్లించవచ్చన్నారు.
పెదవేగి: గత రెండు రోజులుగా ఉత్కంఠభరితంగా జరిగిన అండర్ 19 అంతర్ జిల్లాల అథ్లెటిక్ చాంపియన్‌లో శ్రీకాకుళం బాల, బాలికల జట్టులు సత్తా చాటి చాంపియన్‌గా నిలిచారు. పెదవేగి మండలం ఎంఆర్‌సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈనెల 22, 23 తేదీల్లో అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాల బాలికలు అన్ని రకాల విభాగాల్లో సత్తాచాటారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా శ్రీకాకుళం బాల, బాలికలు నిలిచారని ఎస్‌జీఎఫ్ అండర్ 19 కార్యదర్శి కె జయరాజు తెలిపారు. విజేతలను బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ శివప్రసాద్, పలువురు పీడీలు, తదితరులు పాల్గొన్నారు.


