
అక్రమ నిర్మాణాల తొలగింపు
తాడేపల్లిగూడెం: ‘కూటమి నేతల ఇష్టారాజ్యం’ శీర్షికన గతనెల 14న ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. తాడేపల్లిగూడెంలోని కామాక్షి కమర్షియల్ కాంప్లెక్సులో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో కొన్నింటిని ఓ నిర్మాణదారుడు స్వచ్ఛందంగా తొలగించారు. నలుగురు భాగస్వాముల్లో ఒక్కరుగా ఉన్న టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వలవల బాబ్జీ తన వాటా కింద ఉండాల్సిన పార్కింగ్ స్థలంలో నిర్మించిన మూడు దుకాణాల గోడలను బద్దలు కొట్టించి పార్కింగ్ కోసం ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ఈ నిర్మాణాల్లో భాగస్వాములుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఎరువుల వ్యాపారి, బంగారు నగల వ్యాపారులు మాత్రం స్పందించలేదు. వారి దుకాణాలనూ తొలగించాల్సి ఉంది.

అక్రమ నిర్మాణాల తొలగింపు