
విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాహుల్
నరసాపురం రూరల్ : వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన రాహుల్ గంటా నియమితులయ్యారు. రాహుల్ తండ్రి సుందరకుమార్ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. రాహుల్ విద్యార్థి సమస్యలపై పోరాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు నల్లిమిల్లి జోసఫ్, ఇంజేటి జాన్ కెనడీ, కాకిలేటి ఆనందకుమార్ (మధు) పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కోరారు.
భీమవరం: పట్టణంలోని కాస్మోక్లబ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలకు క్లబ్ సెక్రటరీ బీవీ రామరాజు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేబుల్ టెన్నీస్ ర్యాంకింగ్ పోటీలను నిర్వహించారు. బాలికల అండర్ 17 విభాగంలో మౌపర్ణదాస్, అండర్ 19 విభాగంలో మౌపర్ణదాష్, మహిళల విభాగంలో కాజోల్ సునార్, బాలుర అండర్ 17 విభాగంలో చేతన్ సాయి పటనాన, అండర్ 19 విభాగంలో వపన్ సత్య వెంకటేష్, పురుషుల విభాగంలో తేజా తెలిదేవర సూర్య విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకుడు జీపీసీ శేఖరరాజు తెలిపారు.
ఆగిరిపల్లి: మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతోపాటు కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. రాజవరంలో రైతు తోట రాజబాబుకు చెందిన పశువుల కొట్టం వద్ద పిడుగు పడింది. దీంతో రెండు గేదెలు మృతి చెందాయి. ఒకొక్క గేదె విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని రైతు ఆవేదన చెందుతున్నాడు. కుటుంబ పోషణ కోల్పోయిన రైతును ఆదుకోవాలని సర్పంచ్ జాలాభూషణం ప్రభుత్వాన్ని కోరారు.
మోటార్‌సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
అత్తిలి: మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో కాళ్ల మండలం బండారులంకకు చెందిన ఏలూరి సుబ్బారావు మృతి చెందినట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు. మోపెడ్‌పై చికిత్స నిమిత్తం పిప్పర ఆసుపత్రికి వచ్చి సుబ్బారావు తిరిగి వెళుతుండగా మంచిలి వై జంక్షన్ వద్ద మరో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఢీ కొట్టటంతో గాయపడ్డాడు. మంచిలి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సుబ్బారావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బారావు కుమారుడు అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాహుల్

విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రాహుల్