ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రహసనంగా మార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుంది. పట్టుదలతో చదివి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రహసనంగా మార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుంది. పట్టుదలతో చదివి

Sep 24 2025 5:23 AM | Updated on Sep 24 2025 5:37 AM

ఎవరి దుప్పట్లు వాళ్లే తెచ్చుకోవాలట..

ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సమంజసం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఎస్సీలో ఎంపికై న వారిలో అటు కుకునూరు, వేలేరుపాడు, ఇటు నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అమరావతిలో ఈ నెల 25న వీరందరికీ నియామకపత్రాలు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికోసం వీరందరినీ ముందు రోజు అంటే ఈ నెల 24నే ఏలూరుకు చేరుకోవాలని, అక్కడి నుంచి అమరావతి తీసుకువెళ్తామని జిల్లా విద్యాశాఖాధికారి నుంచి సమాచారం పంపించారు. కుకునూరు, వేలేరుపాడు, నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల నుంచి ఏలూరు చేరుకోవడానికి దాదాపు మూడు గంటలకు పైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎంపికై న వీరిలో కొంతమంది గర్భిణులు, మరికొంత మంది చంటి పిల్లల తల్లులు, ఇంకొందరు వికలాంగులు ఉన్నారు. వీరంతా అన్ని గంటల పాటు ప్రయాణం చేయడం కష్టంతో కూడుకున్న పని.

జిల్లాలో కొత్తగా ఎంపికై న వారు 1063

డీఎస్సీ–25లో జిల్లాలో 1074 ఖాళీలు ఉన్నట్టు గుర్తించి వాటి భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే 1063 మందిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారు. మరో 11 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ ఎంపిక చేయలేదు. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే అన్ని పోస్టులనూ భర్తీ చేసేవారు. రిజర్వేషన్‌, రోస్టర్‌, మెరిట్‌ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తరువాత అర్హత ఉన్న వారిని ఆ పోస్టుకు ఎంపిక చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం సంబంధిత అర్హత లేకుంటే ఆ పోస్టును పక్కన పెట్టి మరో డీఎస్సీలో భర్తీ చేస్తామని చెప్పడాన్ని కూడా విద్యారంగ నిపుణులు తప్పుపడుతున్నారు.

నగరంలోని 11 పాఠశాలల్లో పడక ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా ఎంపికై న ఉపాధ్యాయులకు నగరంలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో బస ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పాఠశాలల తరగతి గదుల్లోనే వారికి పడకల కోసం పరుపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క తరగతి గదిలో 20 మందికి పడక ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతి గదుల్లో దోమలతో ఎలా పాట్లు పడాలో అంటూ అభ్యర్థులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. కస్తూర్బా స్కూల్‌లో 20 గదుల్లో 300 మందికి, సుబ్బమ్మదేవి స్కూల్‌లో 12 గదుల్లో 240 మందికి, గాంధీనగర్‌ నగరపాలక సంస్థ హైస్కూల్‌లో 10 గదుల్లో 200 మందికి బస ఏర్పాటు చేశారు. సురేష్‌ చంద్ర బహుగుణ పోలీస్‌ స్కూల్‌లో 15 గదుల్లో 300 మందికి, పోలీస్‌ స్కూల్‌ ఆడిటోరియంలో 100 మందికి, సెయింట్‌ గ్జేవియర్‌ స్కూల్‌లో 20 గదుల్లో 300 మందికి, సెయింట్‌ ఆన్స్‌ బాలికోన్నత పాఠశాలలో 20 గదుల్లో 300 మందికి ఏర్పాటు చేశారు. వీటితో పాటు శనివారపు పేట హైస్కూల్‌లో 15 గదుల్లో 300 మందికి, వట్లూరు సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో 20 గదుల్లో 400 మందికి, అమీనాపేట సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో 10 గదుల్లో 150 మందికి, బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో 10 రూముల్లో 150 మందికి ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని దాదాపు 16 వేల మందిని ఒకే చోటకు చేర్చి నియామకపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదం. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎంపికై న ఉపాధ్యాయుల్లో కొంతమంది గర్భిణులు, చంటిపిల్లల తల్లులు ఉంటారు. అలాగే వికలాంగులు కూడా ఈ పోస్టులకు ఎంపికయ్యారు. వారిని ఒక రోజు ముందుగా ఏలూరుకు రమ్మనడం, మరుసటి రోజు అమరావతికి తీసుకువెళతామని ఇబ్బంది పెట్టడం ఎంత వరకూ సమంజసం.

– గుగ్గులోతు కృష్ణ,

ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

నియామక పత్రాల అందజేతకు కొత్తగా ఎంపికై న టీచర్లకు పిలుపు

ఎవరి దుప్పట్లు వాళ్ళే తెచ్చుకోవాలని సూచన

మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేరా ? అని ప్రశ్నిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఏలూరులోని 11 పాఠశాలల్లో పడక ఏర్పాట్లు

ఎంపికై న కొత్తవారిని అమరావతి తీసుకెళ్లడానికి ముందు రోజు సాయంత్రమే రిపోర్ట్‌ చేయమని విద్యాశాఖాధికారులు తెలిపారు. ఎంపికై న 1063 మందితో పాటు జోన్‌ –2లో ఎంపికై న మరో 83 మందిని కూడా ఏలూరులోనే రిపోర్ట్‌ చేయాలని తెలపడంతో వారందరికీ బస ఏర్పాటు ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. ఎంపికై న వారితో పాటు వారి కూడా మరొకరిని తీసుకురావాలని ఆదేశాలు అందాయి. ఈ మేరకు అమరావతికి తీసుకు వెళ్ళే వారి సంఖ్య 2300 మంది అవుతున్నారు. ఇంతమందికీ ఏలూరులో 10 ప్రభుత్వ పాఠశాలల్లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో వీరికి పడుకోవడానికి పరుపులు ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ బసకు వచ్చే వారంతా వారి వ్యక్తిగత మెడికల్‌ సామగ్రి తెచ్చుకోవాలని, ఎవరి బెడ్‌షీట్‌ వారే తెచ్చుకోవాలని, తలదిండు, మంచినీటి బాటిల్‌, గొడుగు, రెయిన్‌ కోటు, అభ్యర్థితో పాటు వచ్చే వారు కూడా వారి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. బసకు వచ్చే వారికి కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీని కూటమి ప్రభుత1
1/1

ఉపాధ్యాయ ఉద్యోగాలకు నియామక పత్రాల పంపిణీని కూటమి ప్రభుత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement