ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి

Sep 24 2025 5:23 AM | Updated on Sep 24 2025 5:23 AM

ప్రజా

ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి

ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం దళితులపై వివక్షే తమ్మిలేరుకు వరద

బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారమే ప్రభుత్వం ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ 2023లో నేవీ ఆయుధ డిపో మంజూరైన సమయంలో తాను ఐక్యపోరాట వేదిక నాయకులకు, గిరిజనులకు ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు సాగుతామని చెప్పినట్లు గుర్తు చేశారు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని వాటిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే ఏజెన్సీప్రాంతంలో ఉన్న ఐదు మండలాలకు గానూ రెండు మండలాల్లో గిరిజనులు వివిధ రూపాల్లో భూములు కోల్పోయారని వ్యక్తం చేశారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటు వల్ల మళ్లీ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 30 యాక్ట్‌ అమలులో ఉందని ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా పరిగణంలోకి తీసుకోవాలని అన్నారు. లేకుంటే గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): నిరుద్యోగ సమస్యలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్‌, లెక్చరర్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌, లైబ్రరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. వలంటీర్లను కొనసాగించాలని, విద్యార్హత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీకి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు ఏఐవైఎఫ్‌, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

కై కలూరు: కై కలూరు పంచాయతీ దానిగూడెం దళితులపై దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం, నిర్లక్ష్యం చేయడం దళితులపై వివక్ష చూపడమే అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితుల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.ఇక్బాల్‌, ముత్యాల శ్రీనివాసరావులు వాస్తవ విషయాలు మంగళవారం తెలుసుకున్నారు. దళిత యువకులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని చెబుతున్న వారిపై ఎస్పీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. దానిగూడెం దళిత యువకుల దాడి కేసులో బాధితుల పక్షాన వాదించడానికి ప్రముఖ న్యాయవాధి, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్‌కుమార్‌ మచిలీపట్నం కోర్టుకు బుధవారం వస్తున్నారని నాయకులు మంగళవారం తెలిపారు. శ్రవణ్‌కుమార్‌ వస్తుండటంతో వాదనలు గట్టిగా వినిపించే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు.

చింతలపూడి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 1,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వర్షాలకు ఎగువ ఖమ్మం జిల్లా నుంచి తమ్మిలేరుకు వరద నీరు చేరుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 348.60 అడుగులకు చేరుకుందని, గోనెలవాగు నీటిమట్టం 348.27 అడుగులకు చేరుకున్నట్లు తమ్మిలేరు ఇరిగేషన్‌ ఏఈ లాజర్‌బాబు తెలిపారు.

ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి 1
1/1

ప్రజాభిప్రాయం ప్రకారం సాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement