
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ అష్టమి తిధి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా కనిపించింది. ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు
భీమవరం: పట్టణంలోని శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో 11వ ఐపీఎస్ రాష్ట్ర సమావేశం శనివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ రామరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ప్రచురణలు, క్లినికల్ శిక్షణ వంటి కార్యకలాపాలకోసం విష్ణు డెంటల్ కళాశాల, వియత్నంలోని కాన్‌థో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామరాజు తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం