
కొనసాగుతున్న విచారణ
ఉండి: జూనియర్ లైన్‌మేన్‌పై వచ్చిన ఆరోపణలపై శనివారం మూడోరోజు కూడా విచారణ కొనసాగింది. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాలకు జూనియర్ లైన్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్న దాసరి రాజుపై వచ్చిన ఆరోపణలపై గత మూడు రోజులుగా అధికారులు విచారణ చేస్తున్నారు. శనివారం రెండు గ్రామాల్లోను విద్యుత్ అధికారులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆక్వా రైతులు, ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఉండి ఎలక్ట్రికల్ ఏఈ పులగం శ్రీనివాసరావు తెలిపారు. దర్యాప్తును పూర్తిస్థాయిలో సోమవారం ముగిస్తామన్నారు.
పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు గోవింద నామస్మరణతో పారిజాత గిరి ప్రదక్షిణ చేశారు. వారికి ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. అన్నదాతలు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు సత్య గణేష్ చౌదరి, మంజుషలకు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సత్కరించారు. శనివారం ఆలయానికి వివిధ రూపాల్లో రూ.1,01,076 ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.