అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి
ఆన్‌లైన్‌లో చాటింగ్.. ఆపై మోసం
భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో u
ఏలూరు(మెట్రో): పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టరు కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు అందుకు అనుగుణంగా అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరించారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి చక్కని పరిష్కారాన్ని చూపించాలన్నారు.
ఆర్బీకే నిర్మిస్తే బిల్లులు చెల్లించడం లేదు
ఏలూరు (టూటౌన్): భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో ఆర్బీకే కేంద్రం 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని.. కాంట్రాక్టర్ అయిన తనకు అన్యాయం చేసి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ అంబటి నాగేంద్ర సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా కేంద్రంలో మిగిలిన 10 శాతం పనులు సర్పంచ్, ఈఓ, ఎంపీడీఓ కలిసి పూర్తి చేసి రైతు భరోసా కేంద్రాన్ని పంచాయతీగా మార్చి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. తాను 90 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 9.24 లక్షలు చెల్లించారని, మొత్తం గ్రాంటు 23.94 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు.


