
దెందులూరు: రాజ్యాంగం 140 కోట్ల భారతీయుల ఆత్మ జీవన గమనాన్ని ప్రతిబింబించే సాధనమని, ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్ చిర స్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం కొవ్వలి దళిత వీధిలో దెందులూరు ఎమ్మెల్యే కొఠా రు అబ్బయ్యచౌదరి అధ్యక్షతన ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్, అంబేడ్కర్ విగ్రహాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి ఆమె ప్రారంభించారు. మహిళలకు రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి అంబేడ్కర్ ఆలోచనా విధానంలో సీఎం జగన్ పయనిస్తున్నారన్నారు. సామాజిక సాధికారతకు కృషిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ కొవ్వాలిలో దశాబ్దాలుగా 100 ఎకరాల భూమిని దళితులు సాగు చేసుకుంటుంటే గ్రామ ద్వీప్ అనే సంస్థ ఆ స్థలంలో సాగు చేయకూడదని హైకోర్టు నుంచి ఆర్డరు తీసుకురావడం తగదన్నారు. దళితులకు సాగు హక్కు భద్రత కల్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఆటంకపడితే ఎవ్వరినీ ఉపేక్షించమన్నారు. కొవ్వలి గ్రామస్తుల న్యాయపరమైన సమస్య పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కొఠారు రామచంద్రరావు, జెడ్పీటీసీ నిట్టాలీలా నవకాంతం, ఎంపీపీలు బొమ్మనబోయిన సుమలత, బత్తుల రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, వైస్ చైర్మన్ కాటి సుధాకర్, సర్పంచ్ ఇంటేటి మధులత, జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు వరిపర్తి వరలక్ష్మి, సొసైటీ చైర్మన్ కొమ్మిన రాము, కొలుసు గ ణపతిరావు, బీఎన్‌వీ ప్రసాద్, పార్టీ జిల్లా కమిటీ స భ్యుడు పోకల రాంబాబు, సర్పంచ్‌లు బోదెల స్వ రూప్, సునీత తదితరులు పాల్గొన్నారు.
హోం మంత్రి తానేటి వనిత