రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌లో రజతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌లో రజతం

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

అయినవిల్లి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యాన ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో అయినవిల్లి మండలం నల్లచెరువు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి గుత్తుల మహేష్‌ కృష్ణ రజత పతకం సాధించాడు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అతడు అండర్‌–14 విభాగంలో 42–44 కిలోల కేటగిరీలో పోటీ పడి ఈ ఘనత సాధించాడు. పాఠశాల పీడీ పాయసం శ్రీనివాసరావు ఈ వివరాలు తెలిపారు. మహేష్‌ కృష్ణను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎస్‌కే మహబూబ్‌ బాషా, జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు కె.గణేశ్వరరావు, వైఎస్‌ఎస్‌ ఉషారాణి, కొత్తపేట డివిజన్‌ ఉప విద్యా శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, ఎంఈఓలు బండారు శేషగిరిరావు, పెచ్చెట్టి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు వై.ఝాన్సీ నాగజ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు. మహేష్‌ కృష్ణ్ణతో పాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను కూడా వారు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement