మితిమీరుతున్న మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

మితిమీరుతున్న మట్టి మాఫియా

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

● రంగాపురంలో అర్ధరాత్రి తరలింపు

● దూసుకెళ్తున్న ట్రాక్టర్లతో ఆందోళన

● అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

అనపర్తి: బిక్కవోలు మండలం రంగాపురంలో అర్ధరాత్రి వేళ మట్టి తరలింపు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మట్టి ట్రాక్టర్లు వేగంగా దూసుకెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వీఆర్వో, సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయి టీడీపీ నాయకుడి అండదండలతోనే ఈ దందా సాగుతోందని స్థానికులు అంటున్నారు. మంగళవారం రాత్రి జేసీబీలు, ట్రాక్టర్లతో గ్రామంలోని పేర్రాజు చెరువు, ఎర్ర చెరువులలో మట్టిని తరలించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక ఆయిల్‌ పామ్‌ తోటలలో బాటలు ఏర్పడడంతో ఈ మట్టి దందా జోరందుకుంది. సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement