నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి నలుగురు క్రికెట్ క్రీడాకారులు ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికయ్యారని క్రికెట్ సంఘ అధ్యక్షుడు తలాటం హరీష్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి కర్ణాటకలో ప్రారంభం కానున్న రంజీ పోటీల్లో సీహెచ్ స్టీఫెన్, పి.సత్యనారాయణ రాజు, ఎస్‌వీ రాహుల్, సాయితేజ ఆడనున్నారన్నారు. ఒకేసారి నలురుగు క్రికెటర్లు రంజీకి ఎంపిక కావడం ఉమ్మడి జిల్లాకు గర్వకారణం అన్నారు. అదేవిధంగా అండర్–23 జట్టుకు కెప్టెన్‌గా తోటసాయి శ్రావణ్ ఎంపికయ్యారు. రంజీకి, రాష్ట్ర అండర్–23 జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ సభ్యుడు నవాజ్, కార్యదర్శి నక్కా వెంకటేష్, సత్యానందం శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు.


