కాజ్‌వే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తాం | - | Sakshi
Sakshi News home page

కాజ్‌వే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తాం

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

డ్రైనేజీ శాఖ డీఈఈ హేమలత

సామర్లకోట: వీకే రాయపురం ఏలేరు కాలువలో కోతకు గురైన కాజ్‌వేకు తాత్కాలిక మరమ్మతులు త్వరలో ప్రారంభిస్తామని డ్రైనేజీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.హేమలత శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘కాలువ దాటించని హామీ’ అనే శీర్షికన వచ్చిన కథనానికి ఆమె స్పందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో వీకే రాయపురంలోని కాజ్‌వే కోతకు గురై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆమె అంగీకరించారు. వరి పంట కోతల సమయం దగ్గర పడుతుండడంతో రైతుల రాకపోకలు, పంట ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా సమస్య శాశ్వత పరిష్కారానికి వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement