బెట్టింగ్‌ల కోసం బైక్‌ చోరీలు | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ల కోసం బైక్‌ చోరీలు

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

ఫ 21 వాహనాలు స్వాధీనం

ఫ ఇద్దరి అరెస్టు

ఆరిలోవ: క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి, వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10.65 లక్షల విలువైన 21 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు విశాఖపట్నం ద్వారకా సబ్‌ డివిజన్‌ క్రైం సీఐ వి.చక్రధరరావు తెలిపారు. ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై శ్రీనివాసరావుతో కలసి గురువారం ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. సత్యం జంక్షన్‌ నివాసి వెంపటాపు షణ్ముఖ తన ఇంటి ముందు గత నెల 6న బైక్‌ పార్క్‌ చేశాడు. మర్నాడు ఉదయం చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీనిపై ఆయన ఈ నెల 15న క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరికొన్ని మోటార్‌ సైకిల్‌ చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుల ఫోన్‌ నంబర్లను గుర్తించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి చెందిన గుదే రాంబాబు, హైదరాబాద్‌ బాలానగర్‌ ప్రాంతానికి చెందిన జిడ్డు పవన్‌ ఈ బైక్‌లు దొంగిలించినట్లు తేల్చారు. వారిని అదుపులోకి విచారించగా, వారు ఎక్కడెక్కడ వాహనాలు దొంగిలించారనే వివరాలు బయటపడ్డాయి. నిందితులిద్దరూ స్నేహితులని, క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ వెల్లడించారు. మూడు నెలలుగా వీరు ద్వారకా, ఎంవీపీ, ఎయిర్‌పోర్టు, గాజువాకతో పాటు కాకినాడ, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి, విజయనగరం జిల్లా రామభద్రపురం, ఖమ్మం తదితర ప్రాంతాల్లో బైక్‌లు దొంగిలించి, తక్కువ ధరలకే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 21 ద్విచక్ర వాహనాలను ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణకు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం వాటిని కోర్టుకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించారు.

లేఖ రాయండి.. బహుమతి గెలవండి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉత్తరాల ప్రాధాన్యాన్ని నేటి తరానికి గుర్తు చేసే లక్ష్యంతో తపాలా శాఖ లేఖ రచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో లేఖా రచనపై అవగాహన పెంచేందుకు శ్రీభూమాతకు ఒక లేఖ – ప్రకృతిని పరిరక్షించడానికి నా వాగ్దానంశ్రీ అనే అంశంపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. దేశ పౌరులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు ఒక కేటగిరీ, 18 ఏళ్లు పైబడిన వారిని మరో కేటగిరీగా విభజించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వ్యాసం రాయవచ్చు. చేతితో రాసిన వ్యాసం మాత్రమే అనుమతిస్తారు. ఎన్వలప్‌ కవర్‌ అయితే 1,000 పదాలు మించకుండా, ఇన్‌లాండ్‌ లెటర్‌ అయితే 500 పదాలు మించకుండా రాయాలి. ఈ లేఖలను శ్రీది పోస్టల్‌ సూపరింటెండెంట్‌, ప్రధాన తపాలా కార్యాలయం. కాకినాడశ్రీ అనే చిరునామాకు ఈ నెల 31లోగా పంపాలి. విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి అందిస్తారు. సర్కిల్‌ స్థాయిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి వరుసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలను జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయి విజేతలకు రూ.50 వేలు (ప్రథమ ), రూ.25 వేలు (ద్వితీయ), రూ.10 వేల (తృతీయ) చొప్పున బహుమతులు అందజేస్తారు. విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలని పాఠశాలల యాజమాన్యాలకు తపాలా శాఖ కాకినాడ సూపరింటెండెంట్‌ కె.కృష్ణ విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పకడ్బందీగా అమలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 15 నుంచి సత్యదేవుని సన్నిధిలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌పై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పట్లో కొండ దిగువన టోల్‌గేట్‌ వద్ద, మెట్ల దారిలో భక్తుల లగేజీలు తనిఖీ చేసి, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకునేవారు. గాజు, రాగి, స్టీలు, నాన్‌ ప్లాస్టిక్‌ బయో ఎలైట్‌ (సులభంగా మట్టిలో కలిసిపోయే మొక్కజొన్న పౌడర్‌తో తయారు చేసిన) వాటర్‌ బాటిల్స్‌ మాత్రమే విక్రయించేవారు. అప్పట్లో భక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కిన్లే కంపెనీ మిషన్లలో పొడి చేయించి, తిరిగి ఆ కంపెనీకే విక్రయించేవారు. అప్పట్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ ఖరీదు రూ.20 కాగా, దానికి బదులు గాజు వాటర్‌ బాటిల్‌ లీటరు రూ.60, బయో ఎలైట్‌ వాటర్‌ బాటిల్‌ రూ.40కి విక్రయించేవారు. ఖాళీ గాజు సీసా తిరిగిస్తే రూ.40 రిటర్న్‌ ఇచ్చేవారు. బయో ఎలైట్‌ వాటర్‌ బాటిల్‌ను భక్తులు తీసుకు వెళ్లి, మూడు నెలల పాటు వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement