రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

తొండంగి: స్కూల్‌ గ్రేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వారు ప్రతిభ చూపారు. రెజ్లింగ్‌ 71 కిలోల విభాగంలో ఆర్‌.సూర్య గోల్డ్‌ మెడల్‌ సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

అలాగే, ఫుట్‌బాల్‌ అండర్‌–19 విభాగంలో ఎస్‌జే సింధుజానకి, వి.షర్మిల, అండర్‌–17 విభాగంలో జి.వసంతలక్ష్మి కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో వీరందరూ కారెంపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారు.

గిరిజన

విద్యార్థుల ఎంపిక

శంఖవరం: పి.మల్లాపురంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు అండర్‌–14, 17 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు టి.రాజుబాబు గురువారం తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థి కొల్లు ప్రణీత్‌ అండర్‌–14 రెజ్లింగ్‌లో జిల్లా ప్రథమ స్థానం సాధించాడన్నారు. అతడు ఈ నెల 10, 11, 12 తేదీల్లో పల్నాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. అలాగే, అండర్‌–17 విభాగం రగ్బీ ఫుట్‌బాల్‌ పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి పూజల అనిల్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని పేర్కొన్నారు. అతడు ఈ నెల 13, 14 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాని చెప్పారు.

ఏలేరులో చేపపిల్లల విడుదల

ఏలేశ్వరం: మత్య్సశాఖ ఆధ్వర్యాన జె.అన్నవరం గ్రామ పరిధిలోని ఏలేరు రిజర్వాయర్‌లో గురువారం చేప పిల్లలను విడుదల చేశారు. మొత్తం 11.40 లక్షల చేప పిల్లలను జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు వదిలారు. కార్యక్రమంలో మత్య్సశాఖ అధికారులు కరుణాకరరావు, అనురాధదేవి, ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement