జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీలత
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో 2026–27 సంవత్సరానికి 159 మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ, లైసెన్సుల మంజూరుకు ప్రభుత్వం నూతన ఎకై ్సజ్ పాలసీ ప్రకటించినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 144 ఓపెన్ కేటగిరీ దుకాణాలు, రిజర్వ్ కేటగిరీలో 15 ఉన్నాయన్నారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి 2027 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. 2025–26 అబ్కారీ సంవత్సరానికి వర్తించిన వార్షిక రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ (ఆర్‌ఈటీ) రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 2026–27 సంవత్సరానికీ కొనసాగుతుందన్నారు. కాగా అదనంగా 38 శాతం మేర రెన్యువల్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే పర్మిట్ రూమ్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్‌ను ఒకేసారి లేదా మూడు వాయిదాలలో చెల్లించుకునే అవకాశం ఉందన్నారు. 50 వేల జనాభా లోపు ఓపెన్‌కేటగిరీ రూ.60.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.30.3 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభా లోపు ఓపెన్ కేటగిరీ రూ.71.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.35.8 లక్షలు, 5 లక్షల పైన జనాభా కలిగిన ఓపెన్‌కేటగిరీ రూ.93.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.46.8 లక్షలు చెల్లించాలన్నారు. రెన్యూవల్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ 50 వేలు జనాభాలోపు ఓపెన్ కేటగిరీ రూ.23 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.11.5 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభాలోపు ఓపెన్ కేటగిరీ రూ.27.2 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.13.6 లక్షలు, 5లక్షల పైన జనాభా కల్గిన ఓపెన్ కేటగిరీ రూ.35.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.17.8 లక్షలు చెల్లించాలన్నారు. మద్యం దుకాణాల పునరుద్ధరణ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువని ఆమె తెలిపారు. 22వ తేదీ ఫారమ్ ఏ–4 (ఆర్)లో లైసెన్సులు మంజూరవుతాయన్నారు.


