గణేశ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని
వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలో మహిళా భక్తులు గురువారం రాత్రి దీపాలంకరణ వైభవంగా నిర్వహించారు. శివలింగం, ఓం, వినాయకుడు, స్వస్తిక్ ఆకృతుల్లో దీపాలు వెలిగించారు. ఈ దీపాలంకరణను అధిక సంఖ్యలో భక్తులు తిలకించి, స్వామివారిని దర్శించుకుని
తీర్ధప్రసాదాలు స్వీకరించారు. – రాజమహేంద్రవరం రూరల్


