పెద్దాపురం: స్థానిక మున్సిపల్ కమిషనర్ పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు 9440 20 6790 నంబర్ నుంచి ఫోన్ చేసి, తన పేరు చెప్పి, ట్రేడ్ లైసెన్స్ బకాయి ఉందని, వెంటనే డబ్బులు ఫోన్‌పే, గూగూల్ పే చేయాలంటూ ప్రజలను, వ్యాపారులను బెదిరిస్తున్నారని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎవ్వరూ ఫోన్ చేయరని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బకాయిలుంటే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నగదు చెల్లించి, రశీదు పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
10 మోటారు సైకిళ్లకు రేపు వేలం
అమలాపురం టౌన్: పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న గుర్తు తెలియని 10 మోటార్ సైకిళ్లకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద వేలం నిర్వహిస్తున్నట్లు సీఐ పి.వీరబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేలం పాటలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని సూచించారు.
● పెద్దాపురం కమిషనర్ పేరుతో ఫోన్ కాల్స్
● అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం


