అమలాపురం టౌన్: మలేషియా దేశంలోని సెలంగూర్‌లో ఈనెల 6న జరిగిన సీఎంజే స్టాండర్డ్ చెస్ రేటింగ్ టోర్నీలో పట్టణానికి చెందిన ముషిణి అజయ్ ప్రధమ స్థానం సాధించి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నాడు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐఎమ్ ర్యాంక్ సాధించిన ఏకై క చెస్ క్రీడాకారుడిగా అజయ్ నిలిచాడని జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధి తాడి వెంకట సురేష్ తెలిపారు. అజయ్‌ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి అభినందించారు.
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఈ నెల 23 నుంచి 27 వరకూ జమ్మూ–కాశ్మీర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల రిజిస్ట్రేషన్‌కు ఆహ్వానిస్తున్నట్లు ఆదిత్య అకాడమీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 14వ మినీ అండర్–12, 8వ చైల్డ్ అండర్–10 విభాగాలకు పోటీలు నిర్వహిస్తారని, రాష్ట్ర స్థాయి విజేతలతో పాటు ఒపెన్ చాంపియన్‌షిప్ ప్రతిభ కలిగిన వారు పాల్గొనవచ్చని, ఆసక్తి గలవారు 13వ తేదీలోగా 95535 28888 లేదా 88857 06660 నెంబరుకు సంప్రదింవచ్చని సూచించారు.
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
కంబాలచెరువు: స్థానిక ధోబీఘాట్ వద్ద బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అతడిని మంగళవారపుపేటకు చెందిన అలికి రాజేష్ (27)గా గుర్తించారు. విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలపగా కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): మచిలీపట్నం–ఒంగోలు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రాజమహేంద్రవరానికి చెందిన యారపాటి రాంబాబు (40) బుధవారం అవనిగడ్డ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అవనిగడ్డ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు బందరు మండలం కృష్ణారావుపేటకు సమీపంలో అతడిని ఢీకొట్టింది. రాంబాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని బందరు రూరల్ దక్షిణ మండలం ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.


