ధోల్కర్‌ గణేష్‌ను సందర్శించిన ‘యాత్రికుడు’ | - | Sakshi
Sakshi News home page

ధోల్కర్‌ గణేష్‌ను సందర్శించిన ‘యాత్రికుడు’

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

రాజానగరం: ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో దట్టమైన అడవుల మధ్య బైలాడిలా పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రసిద్ధి చెందిన ధోల్కర్‌ గణేష్‌ విగ్రహాన్ని దేశ సంచారిగా పేరొందిన దివాన్‌చెరువుకు చెందిన పెన్నాడ మోహన్‌ సందర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను తన మోటారు బైక్‌పై సందర్శించి, అక్కడి విశేషాలను సేకరించడం హాబీగా చేసుకున్న ఈ యువకుడు ఇప్పటి వరకు దేశంలోని 23 రాష్ట్రాలలో సుమారు 43 వేల కిలో మీటర్లు పర్యటించాడు.

నగదు, ఐఫోన్‌ అప్పగింత

తుని: ఓ వృద్ధురాలు తాను కోల్పోయిన రూ.10 వేల నగదు, ఐఫోన్‌ను రైల్వే పోలీసులు తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డీఎల్‌ పురానికి చెందిన మెరుగు గంగమ్మ తన చెల్లెలి కుమారుడు రాజుతో కలిసి విశాఖపట్నం వెళ్లేందుకు బుధవారం ఉదయం తుని రైల్వేస్టేషన్‌కు వచ్చింది. రెండో నంబరు ఫ్లాట్‌ఫారంపై కూర్చున గంగమ్మ, రాజు కాకినాడ నుంచి విశాఖ వెళ్లే మెమూ రైలు ఎక్కే క్రమంలో చేతిలో ఉన్న సంచిని కూర్చున్న ప్రాంతంలో మరిచిపోయారు. తరువాత వారికి ఆ విషయం గుర్తుకు వచ్చి రేగుపాలెం రైల్వేస్టేషన్లో దిగి స్థానిక జీఆర్పీ ఎస్సై వీ సత్తిబాబుకు ఫిర్యాదు చేశారు. రెండో నంబరు ప్లాట్‌ఫాంపై తనిఖీ చేసి సంచిన గుర్తించిన రైల్వే పోలీసులు బాధితులకు అప్పగించారు.

స్విమ్మింగ్‌లో

ఉదయ్‌కుమార్‌కు కాంస్యం

ఆసియా చాంపియన్‌షిప్‌నకు ఎంపిక

యానాం: హర్యానాలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్థానిక స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) అకాడమీ ఇన్‌చార్జి ఎన్‌.ఉదయకుమార్‌ కాంస్య పతకం సాఽధించారు. 200 మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగంలో ఈ ఘనత సాధించారు. 2 వేలకు పైగా స్విమ్మర్లు ఈ పోటీల్లో పాల్గొన్న ఈ పోటీలో ఉదయ్‌కుమార్‌ ఈ ఘనత సాధించి 2026లో భారత్‌ నిర్వహించనున్న ఆసియా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ తరఫున ఎంపికయ్యారు. శాయ్‌ అకాడమీ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌నకు ఎంపిక కావడంపై పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement