వెన్నుపోటు పాలన త్వరలోనే అంతం | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పాలన త్వరలోనే అంతం

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

సాక్షి, రాజమహేంద్రవరం/ అనపర్తి/ పెదపూడి/ రంగంపేట: చంద్రబాబు వెన్నుపోటు పాలన త్వరలోనే అంతమవుతుందని, రానున్నది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని సంక్షేమ రాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా రీజినల్‌ ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఎవరూ వెనకడుగు వేయొద్దని, చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలే మన అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయని చెప్పారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఇంట్లో పింఛను అందుకుంటున్న వృద్ధుడు చనిపోతేనే అతని భార్యకు వితంతు పింఛన్‌ ఇస్తున్నారే తప్ప మిగిలిన వితంతువులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఆక్వా ఫీడ్‌ తయారీ కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కవడం వల్లే ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారని బొత్స విమర్శించారు. మరోవైపు రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదన్నారు. చంద్రబాబు అరాచక పాలన వల్ల చాలా మంది బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా సిగ్గుచేటని విచారం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ప్రజల తరఫున పోరాడుదామని పిలుపునిచ్చారు.

అక్రమ కేసులకు

ఎవరూ భయపడొద్దు

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని లెక్క చేయకుండా నిలబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అనపర్తిలో అరాచక రాజ్యం నడుస్తోందని, అయినప్పటికీ ఎవరూ భయపడొద్దన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూల ఓటుగా మార్చుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్పిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

మన గెలుపుతో నల్లమిల్లి

వెన్నులో వణుకుపుట్టాలి

రాజమహేంద్రవరం సిటీ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం, విజయంతో స్థానిక ఎమ్మెల్యే వెన్నులో వణుకుపుట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, ప్రతీ కార్యకర్త ఆర్థికంగా ఎదిగేలా తామంతా బాధ్యత తీసుకుంటామని భరోసానిచ్చారు.

ఓట్ల చోరీ కోసమే

పింఛన్ల నాటకం

మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా యువకులు, మహిళలు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత నుంచి బయటకు వచ్చేందుకు పింఛన్ల నాటకానికి తెరలేపారన్నారు.

నేనున్నా... అధైర్యపడొద్దు

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు దూసుకుపోవాలన్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా తానుంటానని భరోసానిచ్చారు.

సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌, అనపర్తి మండల కన్వీనర్‌ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు గుబ్బల తులసీరామ్‌, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లభశెట్టి రామసతీష్‌, అనపర్తి టౌన్‌ పార్టీ అధ్యక్షుడు నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ సాంబత్తుల చంటి, మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, విధ్వంసాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ పోస్టర్‌ ఆవిష్కరించారు.

ఫ స్థానిక ఎన్నికల్లో నిలిచి గెలుద్దాం

ఫ రానున్నది జగనన్న పాలనే

ఫ కార్యకర్తలకు వైఎస్సార్‌ సీపీ అండ

ఫ శాసనమండలి ప్రతిపక్ష నేత

బొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement