రామచంద్రపురం రూరల్: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, కాజులూరు మండలం గొల్లపాలెం శివారు మొగలిపాలేనికి చెందిన కర్రి బసివి రెడ్డి (52) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బసివి రెడ్డి ఆదివారం ఉదయం 5 గంటలకు తన కుమారుడితో కలసి వ్యాపారం నిమిత్తం తుని బయలుదేరారు. హైవేపై వెళుతుండగా పిఠాపురంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం మొగలిపాలెం తీసుకు వచ్చారు. బసివి రెడ్డి పార్ధివదేహానికి మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా, జిల్లా యువజన కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన మృతితో మొగలిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని జెడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ పితాని సుబ్రహ్మణ్యం, పోతురాజు బాబూరావు, తాడి వీర వెంకటరెడ్డి తదితరులు సందర్శించారు.


