దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ప్రసాదం తయారీ విభాగాన్ని మరింత విస్తరించనున్నాం. భక్తులకు మరింత రుచిగా ప్రసాదాన్ని అందించేందుకు, రద్దీ రోజుల్లో డిమాండ్‌కు తగ్గట్టు ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు దేవదాయ శాఖ జీఫ్ ఇంజినీర్‌తో కలిసి చర్చించాం. అందుకు అవసరమైన వ్యయాన్ని భరించేందుకు ప్రసాద భవన నిర్మాణ దాత మట్టే సత్యప్రసాద్ అంగీకారం తెలిపారు.
– నల్లం సూర్యచక్రధరరావు, దేవస్థానం ఈఓ
విస్తరించేందుకు సిద్ధం
ప్రసాదం తయారీ విభాగాన్ని దేవదాయ శాఖ సీఈ శేఖర్, ఈఓ చక్రధరరావులతో కలిసి పరిశీలించాం. ప్రసాదం తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులపై, ప్యాకర్లు సమస్యలపై చర్చించాం. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రసాదం భవనాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– మట్టే సత్యప్రసాద్, ప్రసాద భవన నిర్మాణ దాత, ట్రస్ట్‌బోర్డు సలహాదారు


