దారిదాపుల్లో మలుపులే! | - | Sakshi
Sakshi News home page

దారిదాపుల్లో మలుపులే!

Mar 7 2026 8:12 AM | Updated on Mar 7 2026 8:12 AM

25 నుంచి వర్జీనియా

పొగాకు కొనుగోళ్లు

దేవరపల్లి: ప్రస్తుత సంవత్సరంలో రైతులు పండించిన పొగాకు కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం గుంటూరులో టుబాకో బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలు సంస్థలు, బోర్డు అధికాలతో చర్చించి నిర్ణయించారు. రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు రీజనల్‌ మేనేజరు జె.సుందర కుమార్‌ తెలిపారు. రీజియన్‌ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

29,132 హెక్టార్లలో సాగు

2025–26 సంవత్సరానికి రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 12,612 మంది రైతులు 29,132 హెక్టార్లలో పొగాకు పండించారు. 14,417 బ్యారన్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో 47.29 మిలియన్ల కిలోలు, తొర్రేడు ప్రాంతంలో పండిస్తున్న ఎన్‌బీఎస్‌ 2.03 మిలియన్ల కిలోలు మొత్తంగా 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినందున ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు, ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 61.27 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా 83.88 మిలియన్ల కిలోలు పండించారు. కిలో సగటు ధర రూ.311, గరిష్ఠ ధర రూ.453 రైతులకు లభించడంతో మంచి లాభాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మార్కెట్‌ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశిస్తున్నారు.

మత్తు వీడక..

ఏజెన్సీలో వివిధ ప్రాంతాలకు అనేక మంది సరదాగా గడిపేందుకు వస్తుంటారు. మధుర స్మృతులను మూటగట్టుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు మద్యం తాగుతుంటారు. తర్వాత వేగంగా వెళ్తూ తెలియని మలుపుల్లో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు ఎందరినో తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుంది. దీనిపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎక్కడా మార్పు రావడం లేదు. చివరికి అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి.

కొండ కోనలు.. చూడచక్కని పచ్చని అందాలు.. వాగులు.. ఆపై ఘాట్‌ రోడ్లు.. ముచ్చట గొలిపే ప్రకృతి సోయగాలు.. వన్యప్రాణులు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదంగా సాగిపోతున్న ఏజెన్సీ ప్రయాణంలో ఓ ‘మలుపు’ జీవితాన్నే మార్చేస్తోంది.. కొందరిని తిరిగి రాని లోకాలకు తీసుకుపోతుంటే, మరికొందరు గాయాలతో బయట పడుతున్నారు.. పర్యాటక అందాలు తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది తరలి వస్తుంటారు.. అలాంటి వారికి ఇక్కడి రోడ్లపై అవగాహన లేక, ఆపై మద్యం మత్తు, మరోపక్క వేగానికి కళ్లెం లేకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

రంపచోడవరం: ప్రకృతి అందాలకు నిలయమైన మన్యంలో రోడ్డు ప్రమాదాలు అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మితిమీరిన వేగం.. ఆపై మలుపులపై అవగాహన లేకపోవడం.. మద్యం మత్తులో ప్రయాణంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. జిల్లాలో రంపచోడవరం, మారేడుమిల్లి అందాలు చూసేందుకు అనేక మంది వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నా, ఎక్కడ తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైపున పోక్సుపేట వద్ద ఏజెన్సీ ముఖ ద్వారం ప్రారంభమవుతోంది. గోకవరం – రంపచోడవరం రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బైక్‌లపై వచ్చేవారు వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. గోకవరం నుంచి రంపచోడవరం గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పోక్సుపేట దాటిన వెంటనే చిన్నబాపనమ్మ తల్లి గుడి వద్ద ప్రమాదకర మలుపు ఉంది. తరువాత ఏ–1 రిసార్ట్స్‌ వద్ద మరో మలుపు ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నరసాపురం దాటిన తరువాత రోడ్డు ఎక్కువ దూరం దిగుడుగా ఉండి ఒక పెద్ద మలుపు ఉంటుంది. సీతపల్లి గుడి తర్వాత ప్రమాదకర మలుపు ఉంది. గతంలో ఇక్కడ అనేక మంది మృత్యువాత పడ్డారు.

వేగంగా వచ్చే వాహనదారులు దగ్గర మలుపు కావడంతో కంట్రోల్‌ చేయలేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఐ.పోలవరం గ్రామానికి సమీపంలోని పాలకాలవ దగ్గరలో, జాగరంపల్లి జంక్షన్‌ వద్ద మలుపులు ఉన్నాయి. రంపచోడవరం– గోకవరం రోడ్డులో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏడుగురాళ్లపల్లికి చెందిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పాలకాలువ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు. ఇదే మలుపులో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రంపచోడవరం –మారేడుమిల్లి మార్గంలోనూ మలుపులు హడలెత్తిస్తున్నాయి. రంపచోడవరం అటవీశాఖ చెక్‌పోస్టు, ఏపీఆర్‌ కళాశాల వద్ద ప్రమాదకర మలుపు ఉంది. మారేడుమిల్లి రోడ్డులో అనేక చోట్ల టర్నింగ్‌ పాయింట్‌లు ఉన్నాయి. గెద్దాడ గ్రామం దాటిన తరువాత సీమగండి వద్ద ఒంపుగా మలుపు ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. సున్నంపాడు – దేవరపల్లి వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. మారేడుమిల్లి నుంచి వస్తూ అనేక మంది పర్యాటకులు ప్రమాదాల బారిన పడ్డారు. తాజాగా మారేడుమిల్లి రోడ్డులో దేవరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వైటీసీ మేనేజర్‌ మృతి చెందారు.

ఘాట్‌ రోడ్లలోనూ..

మారేడుమిల్లి – చింతూరు ఘాట్‌ రోడ్డులో అనేక చోట్ల భద్రతా చర్యలు లేవు. దీంతో వాహనాలు లోయలో ప డి ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉ న్నాయి. పాములేరు నుంచి ప్రారంభమయ్యే ఘాట్‌ రోడ్డు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకునే నా ఽథుడే లేడు. ఇటీవల ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. గతంలో కర్ణాటకాకు చెందిన యాత్రికుల మినీ బస్సు ఘాట్‌ రోడ్డు లో పైమలుపు నుంచి అదుపుతప్పి కిందపడి ఏడుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనేక చోట్ల రక్షణ గోడలు, ఐరన్‌ గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫ ప్రమాదాలకు నిలయంగా మన్యం

ఫ హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు

ఫ జీవితాలను కుదిపేస్తున్న మలుపులు

Advertisement
 
Advertisement
Advertisement