అతివంచక పాలన! | - | Sakshi
Sakshi News home page

అతివంచక పాలన!

Mar 7 2026 8:12 AM | Updated on Mar 7 2026 8:12 AM

మహిళల అణచివేతలో

బాబు సర్కార్‌ విజయం

ఎన్నికల హామీలు, అభివృద్ధి

పనులలో ప్రొటోకాల్‌లో విస్మరణ

దుష్ట పానలకు ఎదురొడ్డి చైతన్యంతో..

మానవత్వం చాటుతున్న మహిళాలోకం

కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల పా లన అంతా మహిళలను కష్టపెట్టడం, నష్టాలపాలుజేయడం, అణచివేయడాలతోనే సాగింది. పైగా మహి ళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ కల్యాణ లక్ష్మి, ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి పథకాలను ప్రారంభిస్తున్నట్టు గొ ప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు కానీ ప్రచారాలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన చంద్రబాబు దగా పాలనపై ప్రత్యేక కథనం...

ఉమ్మడి జిల్లాలో మహిళా శక్తి ఇలా

కాకినాడ జిల్లాలో 7,27,788, తూర్పుగోదావరి 6,39,604, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 5,86,791, పోలవరం జిల్లాలో 95,839 కుటుంబాలను మహిళలు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,152 మందికి పైగా అంగన్‌వాడీలు, 3,200 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. 5,33,815 మంది ఉపాధి కూలీల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. 1,144 సచివాలయాల పరిధిలో వేలాది ఉద్యోగుల్లో మహిళలు అ నేక మంది ఉన్నారు. 2,892 మంది వీఓఏలున్నారు. ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో మహిళా శ్రామికులున్నారు.

మహిళలకు ఇచ్చిన హామీలు మూలకు..

వైఎస్‌ జగన్‌ తెచ్చిన దిశ యాప్‌ను కాపీ కొట్టి శక్తి యా ప్‌ను తీసుకురావడమూ, మహిళా ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్నారు. కాకినాడ జిల్లాలో 4,920 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 2,904, కోనసీమ జిల్లాలో 3,190 మందికి కుట్టులో శిక్షణ ఇచ్చి ఏడాది కాలంగా కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. మహిళా శ్రామికులు ఉండే చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేల ఆర్థికసాయం, సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినప్పటికీ వారికి సౌకర్యవంతమైన ప్ర యాణాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. అదనపు బస్సులు కానీ, సిబ్బంది నియామకాలు కానీ లేక మహిళా ప్రయాణికులు సతమతమవుతున్నారు.

ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాత

ఉమ్మడి జిల్లాలో 1,102 గ్రామ పంచాయతీలుండగా వాటిలో 1070 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా 50 శాతం పైగా మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఈఏడాది ఏప్రిల్‌ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. 2024 చంద్రబాబు ప్రభుత్వ వచ్చిననాటి నుంచి వారి హక్కులు కాలరాస్తున్నారు. 2025 జూన్‌ 28న ప్రొటోకాల్‌ విస్మరించడాన్ని నిరసిస్తూ రామచంద్రపురం కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్లు నిరసన తెలిపారు. వేగాయమ్మపేట, వెంకటాయపాలెం, తాళ్లపొలం సర్పంచ్‌లపై అక్రమ కేసులను నిరసిస్తూ 2025 జనవరి 4న రామచంద్రపురం మండల సమావేశానికి సర్పంచ్‌లు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు.

విచ్చలవిడి మద్యం విక్రయాలు

మద్యం విక్రయాలు వద్దు బాబూ అని మహిళలు నెత్తీ నోరూ మొత్తుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ విక్రయాలను మరింత ప్రోత్సహిస్తోంది. ఈ సర్కార్‌ వచ్చాక కాకినాడ జిల్లాలో 155 ప్రైవేటు షాపులు, 20 బార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 154 షాపులు, 19 బార్లు, కోనసీమ జిల్లాలో 169 షాపులు, 10 బార్లకు అనుమతి ఇచ్చింది. వాటి ప్రారంభించేటపుడు వాటిని తొలగించాలంటూ మహిళలు ధర్నాలు చేశారు. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ సెంటర్‌లో బార్‌ తొలగించాలంటూ గురువారం మహిళలు ధర్నా చేశారు. ఈ ఏడాది సంక్రాంతి నాలుగు రోజుల్లో కాకినాడ జిల్లాలో రూ.23.23 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.17.20 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.15.61 కోట్లు మద్యం విక్రయాలు సాగాయి.

నేరాలు, ఘోరాల్లో సమిధలుగా..

ఉమ్మడి జిల్లాలో మహిళా సంబంధిత సమస్యలపై 2024లో 783, 2025లో 727 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులు 2024లో 114, 2025లో 110, సైబర్‌ సామాజిక మాద్యమాల నేరాలు 2024లో 140, 2025లో 123 కేసులు నమోదయ్యాయి. రాయవరం ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ అయినవిల్లి సంధ్య 2025 ఫిబ్రవరి 26న ప్రేమ వివాహం చేసుకోగా అదే రోజు అర్థరాత్రి వరుడు సూర్య ప్రకాశరావును సంధ్య సోదరులు బండరాయితో కొట్టి కిరాతకంగా చంపేశారు. బాల్య వివాహాలను ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది.

18 ఏళ్లలోపు గర్భం ధరించిన వారు 2024–25లో తూర్పు గోదావరి జిల్లాలో 337 మంది, కోనసీమ జిల్లాలో 506 మంది ఉండగా, కాకినాడ జిల్లాలో గత 10 పది నెలల కాలంలో 2,331 మంది ఉన్నారు. కూనవరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 24 మంది, ఎటపాక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిథిలో 12 మంది కిశోర గర్భిణులున్నారు. రాజమహేంద్రవరం పాలకల్తీ ఘటనలో మృతి చెందిన 10 మందిలో ఐదుగురు మహిళలే. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో ఫిబ్రవరి 28న జరిగిన ఘోర విస్ఫోటంలో 28 మంది మృతిచెందగా వారిలో 10 మందికి పైగా మహిళలున్నారు.

పోరుబాటలో మహిళాలోకం

కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల హాస్టల్‌ను కాపాడుకునేందుకు 2025 డిసెంబర్‌ 31న రాజమహేంద్రవరం కలెక్టర్‌ బంగ్లా వద్ద, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలంటూ ఫిబ్రవరి 10న కాకినాడ కలెక్టరేట్‌ వద్ద విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ నెల 2న విజయవాడ అలంకార్‌ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీలు, 5న ఆశా కార్యకర్తలు ఉవ్వెత్తు న పోరాడారు. కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఈ ఏడాది జనవరి 11న కోటనందూరు మండలం కేఈ చిన్నాయిపాలెంలోనూ, మండపేట పట్టణంలో 2025 మార్చి 13న మహిళలు ధర్నాలు చేశారు.

మానవత్వం చాటిన మహిళలెందరో...

కాకినాడ అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన మేడపాటి పద్మజ (44) అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు 2025 డిసెంబర్‌ 30న ముగ్గురుకి దానం చేశారు.అలాగే ఎంతో మంది మహిళలు ఆయా సందర్భాలలో మానవత్వాన్ని చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement